When you are healthy, financially secure, and successful, you will naturally have friends, relatives, and well-wishers around you.

#PrudentChamps

మీ ఆరోగ్యం బాగున్నప్పుడు… మీకు మంచి ఆదాయం ఉన్నప్పుడు… మీరు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు… మీ చుట్టూ స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు ఎక్కువగా ఉంటారు.

దీనర్థం వారందరూ స్వార్థపరులని కాదు. కానీ జీవితంలో మన స్థితి, పరిస్థితులు మారినప్పుడు చాలా సంబంధాల తీరు కూడా మారుతుందనేది ఒక వాస్తవం. ఈ సత్యాన్ని జీవితంలో ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.

ఈ నిజాన్ని గ్రహించిన తర్వాత మీ ఆలోచన పూర్తిగా మారుతుంది. అప్పుడు మీకు ఒక విషయం స్పష్టమవుతుంది…

“నా జీవితంలో నిజంగా విలువైన ఆస్తులు ఏమిటి?”

చాలామంది స్నేహితులు, బంధువుల ప్రశంసలు పొందాలనే కోరికతో…

* అవసరానికి మించిన విందులు, వేడుకలు నిర్వహిస్తారు.
* ఆడంబరమైన వివాహాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు.
* మద్యం పార్టీలకు డబ్బు వృథా చేస్తారు.
* ఇతరులను ఆకట్టుకోవడానికి అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తారు.
* ఆరోగ్యానికి హాని చేసే ఆహారపు అలవాట్లు పెంచుకుంటారు.
* చెడు వ్యసనాలకు బానిసలవుతారు.
* తమ స్థాయికి మించి ఖర్చు చేస్తూ ఒక తప్పుడు ప్రతిష్ఠను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు.

ఇవన్నీ తాత్కాలికంగా పేరు తీసుకురావచ్చు. కానీ శాశ్వతమైన విలువను ఇవ్వవు.

ఒకవేళ మీ ఆరోగ్యం దెబ్బతింటే… సంపద తగ్గితే… ఉద్యోగం లేదా వ్యాపారం కోల్పోతే… మీ చుట్టూ ఉన్న వారిలో చాలామంది తమ తమ జీవితాల్లో నిమగ్నమైపోతారు. అది తప్పనిసరిగా వారి స్వార్థం వల్ల కాదు. ప్రతి ఒక్కరికీ వారి బాధ్యతలు, పరిమితులు, పరిస్థితులు ఉంటాయి.

మీ జీవిత భాగస్వామి, పిల్లలు కూడా మీ బాధను చూసి మానసికంగా కుంగిపోవచ్చు. వారు మిమ్మల్ని ప్రేమించరని కాదు; జీవిత వాస్తవాలు వారినీ ప్రభావితం చేస్తాయి. తల్లిదండ్రుల ప్రేమ ఎంతో గొప్పది. అయినప్పటికీ వారికి కూడా వయస్సు, ఆరోగ్యం, పరిస్థితుల పరిమితులు ఉంటాయి.

ఈ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత మీ దృష్టి బయట కనిపించే ఆస్తులపై కాదు… నిజమైన ఆస్తులపై పడుతుంది.

అవి…

మంచి ఆరోగ్యం… ఉన్నతమైన వ్యక్తిత్వం… జ్ఞానం… నైపుణ్యం… ఆర్థిక క్రమశిక్షణ… నిజాయితీ… మానసిక ప్రశాంతత… మరియు మంచి విలువలు.

ఇవి ఉంటే జీవితంలో ఏదైనా కోల్పోయినా మళ్లీ నిర్మించుకోవచ్చు.

ఈ ఆలోచన కొందరికి వైరాగ్యంలా అనిపించవచ్చు. కానీ ఇది ప్రపంచాన్ని విడిచిపెట్టమని చెప్పే తత్వం కాదు. ప్రపంచంలోనే జీవిస్తూ శాశ్వతమైనదేంటి… తాత్కాలికమైనదేంటి… అనే వివేకాన్ని పెంపొందించుకోవాలని చెప్పే జీవన సత్యం.

ఇతరుల తాత్కాలిక ప్రశంసల కోసం మీ ఆరోగ్యాన్ని, ఆర్థిక భద్రతను, వ్యక్తిత్వాన్ని, మనశ్శాంతిని త్యాగం చేయవద్దు. జీవితంలోని నిజమైన ఆస్తులను కాపాడుకోండి. మిగిలినవన్నీ వాటి వెంట సహజంగానే వస్తాయి.

#PrudentChamps

When you are healthy, financially secure, and successful, you will naturally have friends, relatives, and well-wishers around you.

This does not mean that everyone is selfish. Many relationships are genuine and built on love and care. However, it is also true that circumstances influence human relationships. The sooner we understand this reality, the wiser our decisions become.

Once you realize this truth, you begin asking a far more important question:

“What are the real assets in my life?”

If your happiness depends on the approval of others, you may start making decisions that add no lasting value to your life.

You may begin to:

* Spend excessively on lavish parties and celebrations.
* Organize extravagant weddings beyond your means.
* Waste money on social gatherings merely to impress others.
* Buy expensive things you don’t need, just to display your status.
* Develop unhealthy eating habits for temporary pleasure.
* Fall into addictions and destructive lifestyles.
* Spend more than you earn simply to maintain an image.

None of these creates lasting happiness. They only create temporary admiration at the cost of your long-term well-being.

Life also teaches another important lesson. If you lose your health, wealth, career, or financial stability, many people who once surrounded you may gradually drift away. This is not always because they are uncaring; everyone has their own responsibilities, limitations, and struggles.

The people who remain by your side are often very few. Parents, when they are alive and able, are among the greatest sources of unconditional love, though they too have their own limitations.

That is why your greatest assets are not your possessions or social status. Your real wealth is:

* Good health
* Strong character
* Knowledge and wisdom
* Valuable skills
* Financial discipline
* Meaningful relationships
* Integrity
* Inner peace

If you protect these, you can rebuild almost anything that life takes away.

At first glance, this philosophy may sound like detachment or renunciation. In reality, it teaches neither. It encourages us to live fully, love deeply, and contribute meaningfully—while understanding the difference between what is temporary and what is truly enduring.

Never sacrifice your health, peace of mind, financial stability, or character merely to gain temporary appreciation from others. Build your life on permanent values, and let recognition come naturally.

Prabhakar Rao Kotapati


Comments

Popular posts from this blog

Don’t chase recognition. Build value that cannot be ignored.

You don’t lose because others are better.